అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, జయకేతనం ఎగురనేసిన బరాక్ ఒబామా జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలో భాగంగా ఆయన తొలుత మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్, తర్వాత అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్ కెయిన్‌లను ఓడించారు.
చక్కటి వ్యూహరచన, యుక్తి, చాతుర్యవంతమైన ప్రణాళికతో ముందుకు సాగడం, ఇతరులకు సహాయపడే గుణం, నిజాయతీతో కూడిన వ్యవహార శైలి ఆయన బలాలు కాగా, అపనమ్మకాలు, అన్నిటినీ తనదనుకోవడం, ముక్కు మీది కోపం, సర్దుబాటు మనస్తత్వం లేకపోవడం, దురాశ ఆయన బలహీనతలు.
ఈ లక్షణాలు ఒబామాకు మాత్రమే కాక ఆగస్టు 4న పుట్టిన వారందరికీ వర్తిస్తాయి. వీరికి త్వరలో పెద్ద మార్పులు కన్పిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆశించిన సహాయాలు, కీర్తి ప్రశంసలు అందుకోగలరు.
ఇతరుల సాయంతో సమస్యలను అధిగమించగలరు. నిరంతర పనుల కారణంగా ఆరోగ్యం దెబ్బతినవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు, చేదు అనుభవాలు ఏర్పడినా, త్వరలోనే తొలగిపోగలవు. నిర్వహణ సామర్థ్యం పెరగగలదు.