మీరు అనూరాధ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారైతే!?

శుక్రవారం, 14 మార్చి 2014 (17:54 IST)
File
FILE
అనూరాధ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన జాతకులు పుట్టిన ఐదు సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు. ఐదు సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు.

22 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరంచగలరు. 29 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు.

49 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి.

ఇక 65 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి