ఇవన్నీ పిల్లలకు ఎవరైనా చెబితే వచ్చేవి కావు...

FILE
* పాఠశాలకు వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద వయసువాళ్లు నిలుచుని ఉన్నట్లయితే వెంటనే లేచి సీటు ఇవ్వటం చిన్నారులు అలవర్చుకోవాలి. ఇంట్లో అమ్మకు పనిలో సాయం చేయటం, పక్క ఇంటి పెద్దావిడను రోడ్డు దాటించటం లాంటివన్నీ సేవ కిందికే వస్తాయి. ఇవన్నీ పిల్లలకు ఒకరు చెబితే వచ్చేవి కావు. వయసు పెరిగేకొద్దీ వాళ్ళంత వాళ్లే ఇలాంటి విషయాలను తెలుసుకునేలా చేయాలి.

* పాఠశాలకు సెలవులు ఇచ్చిన సమయంలో ఇంటినుంచి బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, మళ్లీ ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తారు.. తదితర విషయాలను ఇంట్లోని పెద్దవాళ్లకు తప్పకుండా చెప్పి వెళ్లాలి. ఇలా చేయటంవల్ల ఇంట్లోనివారు నిశ్చింతగా ఉండటమేగాకుండా.. ఆడుకున్నంతసేపు ఎలాంటి గాబరా లేకుండా మీరూ ఆడుకోవచ్చు.

* స్నేహితులనుగానీ, బంధువులనుగానీ కించపరిచినట్లుగా మాట్లాడకూడదు. మీకు నచ్చని వ్యక్తులు తారసపడితే మెల్లిగా పక్కకు తప్పుకోవాలేగానీ.. అనవసరంగా వారితో వాదనకు దిగకూడదు. పేదవారిపట్ల, ముసలివారిపట్ల ప్రేమగా ఉండాలేగానీ, నొప్పించేలా మాట్లాడకూడదు. అమ్మానాన్నలతో ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. అబద్ధాలు చెప్పకూడదు.

వెబ్దునియా పై చదవండి