* తల్లిదండ్రులందరికీ పిల్లలపై అమితమైన ప్రేమ, అభిమానం ఉంటుంది. స్కూల్లో టీచర్లలో కూడా అంతే. కానీ వారు అభిమానాన్ని వ్యక్తపరిచే విధానమే సమస్యల్ని తెచ్చి పెడుతుంది. చిన్నారుల్ని వారి నుంచి దూరం చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే.. బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, చిన్నారులు వారి స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు వారిని కించపర్చే విధంగా తల్లిదండ్రులు మాట్లాడకూడదు.
* ఫ్రెండ్స్‌తో ఆడుకుంటున్నా.. టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడుతున్నా, తల్లిదండ్రులు పిల్లలపై కోప్పడుతుంటారు. ఆ సమయంలో పిల్లలపై తిట్ల పురాణం లంకించుకుంటే వారు చిన్నబుచ్చుకుని క్రమంగా దూరమవుతారు. అలా కాకుండా పిల్లలకి మెల్లిగా, ఓర్పుగా సమయాన్ని వృధా చేయకుండా నడచుకోవాలని నచ్చజెప్పాలి.
* తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు, గొప్ప పదవుల్లో ఉన్నవారైనా తమ పిల్లలకు కూడా అదేస్థాయిలో ఫలితాలు రావాలని భావించడం పొరపాటు. తల్లిదండ్రులు భావోద్రేకాలకు గురై విద్యార్థులపై ఒత్తిడి చేయరాదు. వృత్తి, కుటుంబపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పిల్లల ముందు వ్యక్తం చేయరాదు. విద్యార్థులు ఏ స్థాయిలో ర్యాంకులు సాధించినా, వారిని మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి.