ఎండ వేడిమి నుంచి చిన్నారులను రక్షించుకోండిలా..!!

PTI
* వేసవిలో చిన్నపిల్లలు విపరీతంగా ఏడుస్తున్నట్లయితే.. వారి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయిందనీ, దానివల్ల వాళ్లు అలసట, విసుగుకు గురై ఉండవచ్చునని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అలాంటి సమయంలో వారిచుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా చూడాలి. వట్టివేళ్ల తడికెలను తడిపి కిటికీలకు కడితే చల్లటి గాలి వస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.

* వేసవిలో సాధ్యమైనంతవరకు పిల్లల్ని పరుపులపై కాకుండా, మెత్తటి బట్టలమీదే పడుకోబెట్టాలి. వారి డైపర్స్‌ను తడిలేకుండా ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. పిల్లల దుస్తులను ఉతికేటప్పుడు కాస్తంత డెట్టాల్ వేసి ఉతకటం మంచిది. ఇలా చేయటంవల్ల చెమటవల్ల బట్టలలో చేరిన చెడు బ్యాక్టీరియా నాశనమవుతుంది.

* వేసవిలో పిల్లలకు మరీ చల్లగా కాకుండా, సాధారణంగా ఉండే నీటితో స్నానం చేయించాలి. ఏసీ, కూలర్ల నుంచి వచ్చే చల్లటి గాలి తీవ్రత ఎక్కువగా లేకుండా సహజంగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలకు మెత్తటి గుడ్డను తడిపి కడుతుండటం మంచిది. వేసవిలో పిల్లల ఒంటిపై తడి ఆరకముందే పౌడర్‌ను వేయవద్దు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం చేయించవద్దు. వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేయించాలి.

వెబ్దునియా పై చదవండి