సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూకడుతున్నారు. ఫలితంగా ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏప్రిల్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల చేశారు. మోహన్ లాల్ సరసన శోభన నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం. మోహన్ లాల్ కి గల క్రేజ్ గురించి, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ కథకు తగినట్టుగా ఖర్చు చేస్తూ కేవలం రూ.28 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
అలాంటి ఈ సినిమా కేరళ రాష్ట్రంలోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి ఈ చిత్రం జూన్ నెలలో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.