చిన్నారుల్ని అర్థం చేసుకోండిలా..!!

FILE
* ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం, కళ ఉంటుంది. వీటిని ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు గుర్తించాలి. వారిని అటువైపుగా నడిపించాలి. పిల్లల బయో రిథమ్స్ భిన్నంగా ఉంటాయి. ఎలాగంటే కొంతమంది తెల్లవారుఝామున లేచి చదివేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరికొంతమంది రాత్రి పొద్దుపోయాక నిర్మానుష్యంగా, ప్రశాంతంగా ఉన్న సమయంలోనే చదువుతారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహించాలి.

* కొంతమంది చిన్నారులు ఎదుటి వ్యక్తులతో అస్సలు మాట్లాడరు. భాషాపరంగా ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌, టెన్షన్స్‌, అత్రుత, ఆదుర్ధాలను శారీక ప్రక్రియ ద్వారా తెలియజేస్తారు. దీంతో కారణం లేకుండానే తల, కడుపు నొప్పి.. మరీ చిన్నారులైతే పక్క తడపడం లాంటివి కూడా చేస్తారు. దీన్నిబట్టి విద్యార్థుల్లో ప్రవర్తనల్ని అర్థం చేసుకోవాలి.

* ఇక పరీక్షల సమయంలో పిల్లల ప్రవర్తనా సమస్యలు మరింత తీవ్రంగా మారుతాయి. చిన్నారులు వీటిని ఏ మాత్రం తట్టుకోలేరు. కొందరు కష్టపడి చదివినా వాటిని గుర్తుపెట్టుకోలేరు. పరీక్షల భయంతో అంతా మర్చిపోతారు. కొంతమంది విద్యార్థులు అరకొరగా చదివినా పరీక్షల్లో మంచి ఫలితాల్ని పొందుతారు. ఇలా భిన్న విషయాల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గుర్తించాలి.

వెబ్దునియా పై చదవండి