మీ పిల్లలు డల్‌గా ఉన్నారా.. అయితే కాసేపు ఆడుకోమనండి!

FILE
మీ పిల్లలు డల్‌గా ఉన్నారా.. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బెడ్ మీద పరుండి పోతున్నారా.. అయితే వెంటనే మీరు చేయాల్సింది.. కాస్త వ్యాయామం చేయమని చెప్పటమే. ఇదేంటబ్బా అనుకుంటున్నారా.. అవునండి. నీరసంగా ఉందని చెప్తుంటే వ్యాయామం చేయమని చెప్పటమా అంటున్నారా.. అయితే ఇంకా చదవండి.

పిల్లల ప్రాయమనేది ఆడుతూ పాడుతూ శరీర ఎముకలకు ఎనర్జీ ఇచ్చే ప్రాయం. అందుకని వ్యాయామం చేయమని విసిగించలేం. అందుకే పిల్లల్ని క్రీడల వైపు దృష్టి మరల్చాలి. పాఠశాలల్లో క్రీడలకంటూ సమయాన్ని కేటాయించేలా చూసుకోవాలి.

పరీక్షలు, మార్కులంటూ పిల్లలపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి పెంచేస్తున్న తరుణంలో.. ఇంటికొచ్చిన తర్వాత ట్యూషన్ అంటూ పంపించకుండా, హోమ్ వర్క్ అంటూ విసిగించకుండా అలా గ్రౌండ్స్‌లో కాసేపు ఆడించడం, పార్కులకు తీసుకెళ్లడం చేయాలి.

మీ పిల్లలకు నచ్చిన క్రీడల్ని ఆడుకునేలా చేయడం, సైకిలింగ్ చేయమని చెప్పడం ద్వారా మీ పిల్లల్లో అలసటను దూరం చేయవచ్చనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. క్రీడలతో పాటు పోషకాహారం ఇవ్వడంపై అధిక శ్రద్ధ పెట్టాలని వారు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి