రివిజన్ చేసేందుకు ప్రత్యేకమైన చిట్కాలున్నాయా..?

FILE
* రివిజన్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. ఏ సబ్జెక్టు పరీక్షకు అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి ఎవరికి ఎలా తోస్తే అలా నచ్చినట్లుగానే రివిజన్ చేసుకోవచ్చు. మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు, కాలిక్యులేషన్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్యేలు.. ఇలా వేటికవే వేరు చేసుకుని ప్రశ్నకు మార్కులు ఇచ్చే పద్ధతిలో రివైజ్ చేసుకోవటం మంచిది.

* బట్టీపట్టి రివైజ్ చేయటం సరైన పద్ధతి కాకపోయినా, ఫార్మూలాలు కొన్ని వొకాబ్యులరీతో కూడుకున్న పదాలను మాత్రం బట్టీ పట్టక తప్పదు. అలాగే పాఠ్య పుస్తకాలను చదివి క్లుప్తంగా జవాబులు రాసుకోవాలి. తేదీలు, అంకెల్లాంటివి బయటికి బిగ్గరగా చదివితే బాగా గుర్తుండిపోతాయి.

* చదివిన తరువాత ఏదైనా అంశం రాకపోతే, దాని గురించి వేరే ఏదైనా పుస్తకంలో చదవాలి. లేదా సమాచారాన్ని సేకరించుకోవాలి. అప్పటికీ అర్థం కాకపోతే టీచర్‌ని లేదా ఎవరినైనా పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవాలి. జవాబులను ఇతర క్లాస్‌మేట్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేయాలి. పరస్పరం సహకరించుకోండి.

* చదివేటప్పుడు, నేర్చుకున్నది పేపర్‌మీద పెడుతున్నప్పుడు పరీక్ష హాల్లో ఉన్నట్లు ఊహించుకోవాలి. ఇలా చేస్తే నిజంగా పరీక్షా హాల్లో పరీక్ష రాసేటప్పుడు ఒత్తిడి తగ్గించేందుకు ఉపకరిస్తుంది. అలాగే టైమ్ చూసుకుంటూ గైడ్స్ లేదా పాత ప్రశ్నా పత్రాలకు జవాబులు రాసే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే అసలు పరీక్ష ఎలా ఉంటుందో, సమయానికి అన్ని జవాబులు రాయగలుగుతామో లేదో అర్థం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి