పిల్లల బాధ్యతలో భర్తను కూడా కలుపుకోండి.

గురువారం, 12 జూన్ 2014 (16:33 IST)
మీది తొలి కాన్పు అయితే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. మీ పిల్లలపై శ్రద్ధ చూపించే.. ప్రేమగా చూసుకునే గొప్ప తల్లిగా మీపై మీరు నమ్మకం ఏర్పరుచుకోవాలని.. అప్పుడే ప్రసవం తర్వాత ఏర్పడే ఒత్తిడిని అధిగమించగలుగుతారని వారు చెబుతున్నారు. పిల్లలపై ఎలా శ్రద్ధ పెట్టాలో నేర్చుకోవడం కష్టమైనపుడు, తల్లికంటె ఎక్కువ శ్రద్ధ ఎవరూ చూపించలేరనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 
 
అలాగే పిల్లల బాధ్యతలో మీ భర్తను కూడా కలుపుకుపోవాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ బేబీతో మీ భర్తను కూడా కలుపుకొని ఉండేట్లు చేయండి. బేబీతో గడపడానికి సమయం కేటాయించేలా చూసుకోండి. రాత్రి పూట మీ భర్తను బేబీ కేర్ కోసం కొంత సమయం వెచ్చించమనండి. ఆ సమయంలో కాస్త మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలాంటి చర్యల ద్వారా కొత్తగా తల్లులైన మహిళలకు కాస్త రిలాక్సేషన్ లభిస్తుంది. 
 

వెబ్దునియా పై చదవండి