ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ అయ్యనా మానే రికార్డుల్ని క్రియేట్ చేసింది. IMDbలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ దూసుకుపోతోంది. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా రమేష్ ఇందిర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. కన్నడ, హిందీ, తమిళ భాషలలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు మే 16, 2025న తెలుగులో విడుదల కానుంది. దీంతో దక్షిణ భారతదేశం అంతటా అయ్యనా మానే పరిధిని మరింత విస్తృతం కానుంది.