బేబీ క్షేమం కోసం.. ఆహార అలెర్జీలతో జాగ్రత్త!

శుక్రవారం, 10 అక్టోబరు 2014 (18:33 IST)
పిల్లల సంరక్షణలో ఆహార అలెర్జీపై అధిక శ్రద్ధ చూపాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఆహార అలెర్జీలకు కాకుండా పారెంట్స్ చూసుకోవాలి. శిశువుకు ఘన ఆహారం ఇవ్వడం ప్రారంభించాక.. ఏ ఫుడ్‌తో అలెర్జీ అని గుర్తించండి.  
 
పాలు, గుడ్లు, ఫిష్, షెల్ఫిష్, సోయ, గోధుమలు వంటి ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శిశువు ఇల్లంతా తిరుగుతుంటే.. ప్రమాదకరమైన విద్యుతు గృహోపకరణాలను ఉపయోగించే ప్లగ్గుల నుండి పిల్లలను కాపాడుకోవాటానికి విద్యుత్ సాకెట్ కవర్లు ఉపయోగించడం మంచిది. 
 
అయితే, సాకెట్ కవర్ల మీద ఆధారపడే బదులు, పిల్లలను వీటికి దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. పెన్నులు, కత్తెరలు, లేఖ ఓపెనర్లు స్తాప్లర్స్, కాగితం క్లిప్లను మరియు ఇతర పదునైన సాధనాలను తాళం ఉన్న సొరుగులలో ఉంచండి.

వెబ్దునియా పై చదవండి