Clap by niharika konidala
బ్రహ్మాజీ, కమిటీ కుర్రోళ్ళు యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్ లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ కథకళి. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్ కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు.