చదివే పిల్లలకు రాగి జావ ఇస్తే..?

బుధవారం, 13 జూన్ 2018 (14:26 IST)
దీర్ఘకాల అజీర్తి సమస్యలను పరిష్కరించే శక్తి రాగులకు వుంది. రాగుల్లో ఇనుము శాతం ఎక్కువ. దీనిలోని ప్రధాన పోషకాలైన ప్రొలామిన్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో రొట్టెలు, దోశ, పుట్టు, జావ తయారు చేసుకోవచ్చు. దీన్ని పాలు లేదా పెరుగుతో కలిసి తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చదువుకునే పిల్లలకు రాగులను నిత్యం ఏదో ఒక రూపంలో ఇవ్వడం ద్వారా మెదడు చురుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే అజీర్ణ సమస్యలు తొలగిపోవాలంటే సొరకాయను వంటల్లో చేర్చాలి. బీపీ, కాలేయ సమస్యలు వున్నవారికి సొరకాయ ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి నిత్సం తీసుకుంటే మూత్ర సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. 
 
ఇకపోతే.. పిల్లలకు గుమ్మడి గింజలను ఇవ్వడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కంటిచూపుకు గుమ్మడి గింజల ద్వారా కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరకప్పు గుమ్మడి ముక్కలను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తుంది. వేయించిన గుమ్మడి గింజలను పిల్లల స్నాక్స్ డబ్బాలో నింపడం చేస్తే పిల్లల్లో ఏర్పడే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు