పిల్లలను అతిగా పొగడకండి.. అది మానసిక ఎదుగుదలకు..?

శనివారం, 27 డిశెంబరు 2014 (17:47 IST)
పిల్లలను అతిగా పొగడటం మంచిది కాదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అతిగా పొగడడం వల్ల పిల్లలు ప్రతిసారీ తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఉంటారు. ఈ పద్ధతి కారణంగా వారు మానసిక ఎదుగుదలకు మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పిల్లల ఆలోచనలకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుకునేందుకు ప్రశంస ఓ సాధనంగా ఉపయోగపడినా.. అది పరిమితంగానే ఉండాలని వారు అంటున్నారు. తరచూ పిల్లల్ని ప్రశంసిస్తూ ఉంటే ప్రతి దానికి వారు ప్రశంసలని ఆశిస్తూనే ఉంటారు. 
 
ప్రశంసల కారణంగా ప్రతి చిన్న విషయానికి పారెంట్స్‌పైనే ఆధారపడతారు. దీంతో పిల్లలు తమదైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను వారికీ వారే పోగొట్టుకుంటారు. ఆత్మవిశ్వాస లోపం ఏర్పడుతుంది. కాబట్టి ప్రశంసించే ముందు ఆలోచించండి.

వెబ్దునియా పై చదవండి