Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

దేవీ

మంగళవారం, 6 మే 2025 (20:31 IST)
tota tarani, AM Ratnam, Pawan etc
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి అయిందనీ, పవన్ చాలా సహకరించారని నిర్మాత ఎ.ఎం. రత్నం తెలియజేశారు. నేడు షూటింగ్ స్పాట్ లో ఓ ఫొటోను విడుదల చేశారు. తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ గా అద్భుతమైన సెట్ వేసి నాచురాలిటీని క్రియేట్ చేశారని తెలిపారు. షూట్ బ్యాంగ్‌తో ముగుస్తుంది.  తదుపరి వచ్చేది స్క్రీన్‌లను ఫైర్ తో అల్లాడిస్తారని ఓ పోస్ట్ ను కూడా పోస్ట్ చేశారు. 
 
త్వరలో భారీ ట్రైలర్, బ్లాక్ బస్టర్ పాటలు రాబోతున్నాయి అని సూచించారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రటీమ్ వుంది. అయితే, ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న గ్రాండ్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో పూర్తి నిర్ణయం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో చేతిలో ఉందని తెలుస్తోంది. కానీ ఓటీటీ వారు ఈ రిలీజ్ డేట్‌ను జూన్ రెండో వారానికి మార్చాలని తెలియజేసినట్లు సమాచారం.
 
కాగా, ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా ఏ.ఎం.రత్నం  నిర్మాత. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు