ఎన్.టి.ఆర్., దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే షెడ్యూల్ జరిగింది. ఎన్.టి.ఆర్. నటనను చూసి మోనిటర్ లో వీక్షిస్తున్న దర్శకుడు మాడ్ సెట్ విత్ మ్యాడ్ మేన్ అంటూ ఎన్.టి.ఆర్.కు కితాబిచ్చారు. ఇప్పటివరకు చేసిన రష్ చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రుక్మిణీ వసంత్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా పీరియాడిక్ యాక్సన్ డ్రామాగా రూపొందుతోంది.