ఎగ్జామ్స్ సమయంలో యాంగ్జైటీతో టెన్షన్ ఎక్కువవుతుందా..?

FILE
* మొదట్నుంచీ ఎప్పటి పాఠాలు అప్పుడే చదివేస్తే పరీక్షల సమయంలో పిల్లల్లో యాంగ్జైటీ ఉండదు. ఫలితంగా అననీ గుర్తుంటాయనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరీక్షల్ని బాగా రాయవచ్చు. అలా కాకుండా సంవత్సరమంతా చదివిన పాఠాలన్నింటినీ ఒకేసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే యాంగ్జైటీ పెరిగిపోతుంది.

* చదివిన అంశాలను బొమ్మలు, చిత్రాల రూపంలో గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా చదివిన ప్రతి అంశాన్ని ఒక్కో అర్థవంతమైన కథలాగా గుర్తు పెట్టుకుంటే మరీ మంచిది. అంతేగానీ బట్టీ పట్టకూడదు. ఎగ్జామ్స్ సమయంలో బట్టీపట్టిన అంశాలు గుర్తురాకపోతే యాంగ్జైటీని మరింతగా పెంచేస్తుంది. అందుకనే చదివిన అంశాలన్నింటినీ ఓ కథలా గుర్తుపెట్టుకోవాలి.

* ప్రతిరోజూ డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్ చేయటం మంచిది. దీనివల్ల నెగటివ్ ఆలోచనలు తగ్గటమేగాకుండా, సాధించాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు సాధ్యమవుతుంది. రోజూ అదేపనిగా చదవటం కాకుండా మెదడుకు మేత కల్పించే ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. అయితే ఇవన్నీ మెదడుకు వినోదం కలిగించాలేగానీ.. మరింత భారంగా, శ్రమగా ఉండకూడదు.

* టీవీ చూడటాన్ని పూర్తిగా తగ్గించాలి. బాగా చదువుకునే ఎవరికివారే ప్రోత్సహించుకోవటం అవసరం. వీటిని మర్చిపోతానని కాకుండా, అవి గుర్తుంటాయనే పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవాలి. క్లాసులో బాగా చదివే విద్యార్థులతో స్నేహంచేసి, చక్కగా చదువుకోవాలి.

వెబ్దునియా పై చదవండి