చేతికి ఏది దొరికినా నేలమీద గీసేస్తున్నారా..?

FILE
* చిన్నారుల చేతికి ఏది దొరికినా నేలమీద గీసేస్తూ ఉంటారు. అందుకే వారికి అందుబాటులో పలక, చాక్‌పీస్‌ ఉంచితే.. క్రమంగా వాటిని పట్టుకోవడం వారంతట వారే నేర్చుకుంటారు. ఆసక్తిని బట్టి పెద్దలు కూడా రంగంలోకి దిగి, రాయడం నేర్పించాలి. అయితే పిల్లలకు ఇష్టం లేకపోతే మాత్రం బలవంతం చేయకూడదు.

* కాస్త ఊహ తెలిసిన పిల్లలకయితే మహనీయులు చిత్రాలు చూపించి పేర్లు పలికించాలి. చిత్రం చూపించి ఎవరిదో గుర్తించమనాలి. తరవాత పేరు చెప్పి చిత్రం చూపమనాలి. ఇలా తరచూ చేయడం వల్ల భవిష్యత్‌లో వారి విజయగాథలు త్వరగా నేర్చుకుంటారు.

* స్నానం చేయకుండా మారాం చేసే పిల్లల కోసం ప్రత్యేకంగా బాతింగ్‌టాయ్స్‌ దొరుకుతాయి. వాటికోసం హంగామా చేయకుండా సాధారణ బొమ్మలు ప్లాస్టిక్‌ కూరగాయలు, పండ్లు, పక్షులు, జంతువులను ఎంచుకొని నీళ్లటబ్‌లో వేస్తే పైన తేలియాడుతుంటాయి. పిల్లలు వాటిని చూస్తూ, మారాం చేయకుండా స్నానం చేస్తూ బొమ్మలను ఆసక్తిగా, గమనిస్తూ ఆడుకుంటారు.

* అలాగే మూడేళ్ల లోపు పిల్లలకు స్వతహాగా తినడం నేర్పించాలి. ముందు ప్లేటులో పదార్థాలు లేకుండా ప్రాక్టీస్‌ చేయించాలి. నెమ్మదిగా స్పూను చేతికిచ్చి అలవాటు చేయాలి. అంతేకానీ వారు తినట్లేదని గద్దించడం, కొట్టడం సబబు కాదు. అలాచేస్తే పిల్లలు మొండిఘటాల్లా తయారయ్యే ప్రమాదం ఉంది.

వెబ్దునియా పై చదవండి