టీనేజీలో ఎన్నో మార్పులు, మరెన్నో ఆకర్షణలు..!

FILE
* పిల్లలు టీనేజీలోకి వచ్చారంటే వారిలో ఎన్నో మార్పులు. చుట్టూ మరెన్నో ఆకర్షణలు. ఆ సమయంలో వారికి సరైన దిశానిర్దేశం అవసరం. పిల్లల్ని భయపెడితేనో, బెదిరిస్తేనో సరైన మార్గంలోకి వస్తారనుకోవడం పొరపాటు. అనునయించి చెప్పాలి. ఎప్పడూ అసహనంగా, చిరాగ్గా ఉండే పిల్లలను దగ్గరకు తీసుకొని అనునయిస్తూ వారి సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

* పిల్లలకు స్వేచ్ఛనిస్తూనే వారిలోని లోపాలను తెలియజెప్పటం అవసరం. అలాంటప్పుడే వారు ప్రతి విషయం తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. వారి సమస్యలలో పెద్దలు సలహాలు ఇవ్వటమే కాకుండా, ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి ఏ విధంగా ఆలోచించాలో, ఎలా నిర్ణయం తీసుకోవాలో వారికి అర్థమయ్యేటట్లు తెలియజెప్పాలి.

* టీనేజీలో మార్పులు సహజం. అలాంటి వయసులో వారితో అజమాయిషీ ధోరణి ప్రవర్తన వల్ల లాభం ఉండదు. అందుకే వారిని పిల్లల్లా కాకుండా స్నేహితులుగా భావించాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. పిల్లలకు ఇలాంటి వెసులుబాటు కల్పించకపోతే.. ఎదుటివారు ఏ మాత్రం ప్రేమగా మాట్లాడినా ఇట్టే ఆకర్షితులవుతారు. అలాంటప్పుడే పొరబాట్లు జరిగే అవకాశం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి