పిల్లలకి కథలంటే ప్రాణం.. అందుకే కథలు చెప్పండి..!!

FILE
* సాధారణంగా చిన్నపిల్లలకు కథలంటే ప్రాణం. అదికూడా ఊహాజనితమైన కథలంటే మరీ చెవికోసుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు వారి చిన్నవయస్సులో అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన కథలను గుర్తుకు తెచ్చుకుని పిల్లలకు వినిపిస్తే వారి సంతోషానికి అవధులే ఉండవు.

* మఖ్యంగా పిల్లలు నిద్రపోయే సమయంలో తల్లిదండ్రులు కథలు చెప్పినట్లయితే.. ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడులు లేకుండా వారు హాయిగా నిద్రపోగలుగుతారని పిల్లల నిపుణులు సూచిస్తున్నారు. అందుకనే చిన్నారులు పక్కమీదకు చేరగానే నిద్రపోయేలా కాకుండా కనీసం 20 నిమిషాలపాటు కథలు లేదా వారికి నచ్చిన పుస్తకాలను చదివేలా ప్రోత్సహించాలి. ఆ తరువాత వారిని నిద్రకు ఉపక్రమించేలా చేస్తే ఎంతో తెలివిగలవారిగా తయారవుతారని వారంటున్నారు.

* పిల్లల్లో గ్రాహకశక్తి అధికంగా ఉంటుందని, చిన్నతనంలో కథల రూపంలో వినే అంశాలు వారి భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చిన్నారులు ఏవి చెడు అంశాలు, ఏవి మంచి అంశాలు అనే అంచనాకు రాగలుగుతారనీ.. తద్వారా మంచివైపు వారు పురోగమిస్తారని అంటున్నారు. కాబట్టి, పిల్లలు పడుకునేమందుకు ఎంచక్కా కథలు చెప్పి నిద్రబుచ్చుతారు కదూ..?!

వెబ్దునియా పై చదవండి