పిల్లలకు జ్వరం అంటేనే గాబరా పడిపోతే ఎలా..?

FILE
* చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాబరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్' మాత్రలను మింగిస్తుంటారు. నిజానికి అంతగా గాబరా పడాల్సిన అవసరమేమీ లేదనీ వైద్యులు చెబుతున్నారు. జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో వారి శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలని అంటున్నారు.

* శరీరం వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్‌ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నప్పుడు మాత్రమే ప్యారాసిటమాల్‌ మాత్రను మింగిచాలని వైద్యులు సూచిస్తున్నారు.

* అలాగే పిల్లలు వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్‌ ఇవ్వచ్చు. ఒకవేళ వైద్యులు వైరల్‌ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే.. ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయాటిక్‌ల వంటివి ఇవ్వాలి. కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తల్లిదండ్రులు తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి