పిల్లలకు "దిష్టి" తీయటం ఎలాగంటే..?

FILE
* చిన్నపిల్లలకు "దిష్టి" తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అయితే, దిష్టి ఎలా పడితే అలా తీయకూడదనీ, దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు.

* చిన్నారులకు దిష్టి తీసేటపుడుఎ వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు. పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి.

* ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్లు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్న పిల్లలకు తాకకూడదు. వాళ్లు కాళ్లూ చేతులను శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పిల్లలకు ఎత్తుకోవాలి. అదే విధంగా అర్థరాత్రుల్లోనూ, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.

వెబ్దునియా పై చదవండి