ఆపిల్ స్ట్రాబెర్రీ ప్యూరీ

కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీలు... పది
ఆపిల్ ముక్కలు... ఒక కప్పు
పాలు... పావు కప్పు

తయారీ విధానం :
స్ట్రాబెర్రీలపై ఉండే తొడిమను తీసివేసి శుభ్రం చేయాలి. కాచి చల్లార్చిన పాలు, ఆపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీలను మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. దీనిని గ్లాసుల్లోకి వంపి సర్వ్ చేయాలి. అంతే ఆపిల్ స్ట్రాబెర్రీ ప్యూరీ సిద్ధమైనట్లే... ఇలా తాజాగా తయారు చేసిన ప్యూరీని పిల్లలకు అందించటం మంచిది.

మిగతా పండ్లతో పోల్చితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తక్కువ ఫ్లేవర్ ఉండే ఆపిల్ లాంటి పండ్లతో చేర్చితే రుచికరమైన ప్యూరీ తయారవుతుంది. పాలలో కాల్షియం, స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. స్ట్రాబెర్రీని అరటిపండుతో చేర్చితే ఇంకా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి