ఆలూ మసాలా నూడుల్స్‌

కావలసిన పదార్థాలు :
నూడుల్స్... 400 గ్రా.
బంగాళాదుంపలు... నాలుగు
పచ్చిమిర్చి... ఐదు
టొమాటో ముక్కలు... రెండు కప్పులు
కొత్తిమీర తురుము... అర కప్పు
ఉప్పు... సరిపడా
మసాలా పొడి... రెండు టీ.
జింజర్‌ సాస్‌... రెండు టీ.
మంచినీళ్లు... ఒక లీ.

తయారీ విధానం :
బంగాళాదుంప, టొమాటో ముక్కల్ని సన్నగా చిప్స్‌ మాదిరిగా కోసుకోవాలి. బాణలిలో నీళ్లు పోసి నూడుల్స్‌ వేసి ఉడికించాలి. అవి ఉడికిన తరువాత ఉప్పు, మసాలాపొడి, జింజర్‌సాస్‌, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దగ్గరగా ఉడికించాలి.

సెగ తగ్గించి కొత్తిమీర, బంగాళాదుంప, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఇగిరేవరకూ ఉంచి దించాలి. అంతే వేడి వేడి ఆలూ మసాలా నూడుల్స్ రెడీ అయినట్లే... వీటిని జింజర్‌ సాస్‌, గ్రీన్‌ చిల్లీ సాస్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి