కావలసిన పదార్థాలు : రొయ్యలు... పావు కిలో టొమాటో... 100గ్రా. ఉల్లిపాయలు... 2 (మీడియంసైజు) మిరియాలు... 5 గ్రా. క్యారెట్... 100గ్రా. చికెన్‌స్టాక్... ఒక లీటరు బియ్యం... 50గ్రా. కుంకుమ పువ్వు... పావు టీ. ఉప్పు... తగినంత వెన్న... ఒక టీ.
తయారీ విధానం : రొయ్యాల్ని శుభ్రంచేసి ఉంచాలి. ఓ గిన్నెలో వెన్న వేసి రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. చికెన్‌స్టాక్‌లో బియ్యం, కుంకుమపువ్వు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే పలుచని జావలా తయారవుతుంది. చివరగా ఇందులో వెన్నతో వేయించిన రొయ్యల ముక్కలు వేసి, ఉప్పు సరిచూసి... వేడివేడిగా సర్వ్ చేయాలి.
రొయ్యలంటే ఎప్పుడూ మసాలా కర్రీగానో లేదా ఫ్రై చేసుకుని తింటుంటాం. అయితే చైనీస్ స్టయిల్లో రొయ్యలను సూప్ చేసుకుని తాగితే కాస్తంత భిన్నంగా ఉంటుంది. మరి మీరూ ప్రయత్నిస్తారు కదూ..?