కోకో గ్రౌండ్‌నట్ కబాబ్‌

కావలసిన పదార్థాలు :
కొబ్బరికాయ... ఒకటి
పచ్చిమిర్చి... ఐదు
ఉల్లిపాయలు... వంద గ్రా.
కొత్తిమీర... కట్ట
నిమ్మరసం... 4 టీస్పూన్లు
వేయించిన శెనగపప్పు... అరకప్పు
నూనె... వేయించడానికి సరిపడా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కొబ్బరి తురిమి, అందులోనే సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కలిపి ఉంచాలి. వేయించిన శెనగపప్పును మిక్సీలో వేసి పొడి కొట్టాలి. ఇందులో కొబ్బరి తురుము, ఉప్పు, నిమ్మరసం అవసరమైతే తగినన్ని నీళ్లు కలిపి ఉండలుగా చుట్టాలి. తరువాత వీటిని కోలగా చేసి వేళ్లతో కొద్దిగా ఒత్తి... మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే కోకో గ్రౌండ్‌నట్ కబాబ్‌‌లు సిద్ధమైనట్లే...!

వెబ్దునియా పై చదవండి