కావలసిన పదార్థాలు : పుట్టగొడుగులు (మష్రూమ్స్)... పావు కేజీ పాలు... అర కప్పు కార్న్‌ఫ్లోర్... అర టీ. ఎండిన మెంతి ఆకులు... అర టీ. నూనె... ఒక టీ. ఉప్పు... తగినంత ఎండుమిర్చి... నాలుగు వెల్లుల్లి రెబ్బలు... నాలుగు అల్లం... అంగుళం సైజంత ధనియాల పొడి... ఒక టీ. జీలకర్ర పొడి... ఒక టీ.
తయారీ విధానం : ముందుగా మష్రూమ్స్‌ను రెండు భాగాలుగా కట్ చేసుకుని, శుభ్రంచేసి ఆరబెట్టాలి. పాలల్లో కార్న్‌ఫ్లోర్ కలిపి పక్కన ఉంచాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి, ముందుగా నూరి పెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి ఆకులను వేసి వేయించాలి.
తరువాత మష్రూమ్స్, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలు, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. ధనియాలపొడి, జీరా పొడులను కూడా వేసి బాగా కలిపి ఒక నిమిషం తరువాత దించేయాలి. అంతే తందూరి మష్రూమ్స్ రెడీ అయినట్లే.. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచింగా ఉంటాయి.