కావలసిన పదార్థాలు : కకోవా పౌడర్... ఆరు టీ. మైదా... ఒకటిన్నర కప్పు నెయ్యి... 12 టీ. కండెన్స్‌డ్ మిల్క్ (కోవా పాలు)... ఏడు కప్పులు జీడిపప్పు... ఒకటిన్నర కప్పు పంచదార... 9 కప్పులు మంచినీరు... ఒకటిన్నర కప్పు
తయారీ విధానం : మందపాటి బాణలిలో నెయ్యి వేసి కాగాక మైదా పిండి వేసి వేయించాలి. కకోవా పొడిని కోవాపాలల్లో కరిగించి సన్నటి మంటమీద తిప్పుతూ కొద్దిసేపు ఉడికించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పంచదారను వేసి నీళ్లు పోసి, లేతపాకం రానివ్వాలి. తరువాత వేయించిన మైదా వేసి తిప్పుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డ తరువాత జీడిపప్పు వేసి కలపాలి.
ఇప్పుడు మూడొంతుల మైదా పాకాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి. మిగిలినదాంట్లో కకోవా మిశ్రమం వేసి బాగా కలిపి, ప్లేటులోని మైదా పాకంమీద పోసి చల్లారిన తరువాత ముక్కలుగా కోసి వడ్డించాలి. అంతే కకోవా చాకో వెరైటీ బర్ఫీలు సిద్ధమైనట్లే...! మీరూ ఓసారి ప్రయత్నించి చూస్తారు కదూ...?!