కావలసిన పదార్థాలు : చికెన్ బ్రెస్ట్ ముక్కలు... నాలుగు నిమ్మరసం... రెండు టీ. ఉప్పు... తగినంత పెరుగు.. ఒక కప్పు నూనె... పావు కప్పు వెలుల్లి.. నాలుగు రెబ్బలు అల్లం... చిన్న ముక్క జీలకర్ర.. ఒక టీ. కారం... పావు టీ. గరంమసాలా... అర టీ. బంగాళాదుంప.. ఒకటి బటన్ మష్రూమ్... వంద గ్రా. పనీర్... వంద గ్రా. రెడ్ క్యాప్సికమ్... వంద గ్రా. ఆకుపచ్చ క్యాప్సికమ్.. వంద గ్రా.
తయారీ విధానం : చికెన్ ముక్కల తోలుతీసి, అంగుళం సైజులో కత్తిరించాలి. క్యాప్సికమ్‌లను కూడా చదరపు ముక్కలుగా కోయాలి. చికెన్, క్యాప్సికమ్ ముక్కలపైన నిమ్మరసం, ఉప్పు చల్లి అరగంటపాటు నానబెట్టాలి. పెరుగులో సగం నూనె పోసి కలపాలి. అల్లం, వెల్లుల్లి తురుము, జీలకర్రపొడి, గరంమసాలాలను కూడా అందులో కలపాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని చికెన్, క్యాప్సికమ్ ముక్కలకు పట్టించి ఓ రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి నానబెట్టాలి. ఇప్పుడు చికెన్, క్యాప్సికమ్ ముక్కలను ఒకదాని తరువాత ఒకటిగా ఓ పుల్లకు గుచ్చి.. మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి 500 డిగ్రీల వేడివద్ద 15 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత వాటిని ఓసారి బయటికి తీసి నూనె పూసి రెండో వైపునకు తిప్పి మళ్లీ మరో 15 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. అంతే వేడి వేడి ముర్గ్ ఔర్ సబ్జ్ సీఖ్ తయార్..!!