రెడ్ గోర్డ్ స్పెషల్

కావలసిన పదార్థాలు :
ఎర్ర గుమ్మడికాయ (రెడ్ గోర్డ్)... ఒక కేజీ
పాలు... అర లీ.
పంచదార... ముప్పావు కేజీ
కోవా... పావు కేజీ
యాలకులు... పది గ్రా.
నెయ్యి... 150 గ్రా.
జీడిపప్పు... 25 గ్రా.

తయారీ విధానం :
ఎర్ర గుమ్మడికాయను చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. తరువాత గుమ్మడికాయ ముక్కల్ని పాత్రలో వేసి మెత్తగా ఉడికించాలి. ఆ తరువాత ఒక కడాయిలో నెయ్యిపోసి కాగాక అందులో ఉడికించిన గుమ్మడికాయ పేస్టును వేసి ఫ్రై చేయాలి. దాంట్లోనే పంచదార, కోవా కలిపితే పలుచగా తయారవుతుంది. ఇప్పుడు అది చిక్కబడేదాకా స్టవ్‌పైన అలాగే ఉంచి, దించేముందు యాలకుల పొడి, జీడిపప్పు చల్లాలి. అంతే రెడ్ గోర్డ్ స్పెషల్ తయారైనట్లే...!

వెబ్దునియా పై చదవండి