కావలసిన పదార్థాలు : సాల్మన్ ఫిష్.. ఒక కిలో రెడ్ వైన్.. 600 మి.లీ. విస్కీ.. 600 మి.లీ. నిమ్మకాయ రసం.. 8 టీ. పాల మీగడ.. 900 మి.లీ. మిరియాలపొడి.. తగినంత ఉప్పు.. సరిపడా
తయారీ విధానం : ముందుగా సాల్మన్ ఫిష్‌ను ముళ్లు లేని విధంగా ముక్కలుగా కోసుకోవాలి. వీటిని గ్రిల్ మీద ఉంచి రెడ్ వైన్, ఉప్పు, మిరియాలపొడి మిశ్రమాన్ని దానిపై చల్లుతూ ఉండాలి. ఒక గిన్నెను స్టౌవ్‌పై ఉంచి కాస్త వేడి చేయాలి. అందులో విస్కీ పోయాలి. నురగ వస్తున్న సమయంలో ఉప్పు, మిరియాలపొడి, పాల మీగడ వేస్తూ.. మరోవైపు నిమ్మరసం వేస్తూ కలుపుతూ ఉండాలి.
తరువాత దాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన సాస్‌ను చేప ముక్కలపై చల్లి సర్వ్ చేయవచ్చు. లేదంటే విడివిడిగా కూడా ఉంచి సర్వ్ చేయవచ్చు. ఇది నలుగురు సభ్యులుండే కుటుంబానికి చక్కగా సరిపోతుంది.