కావలసిన పదార్థాలు : సేమ్యా... 400 గ్రా. కుంకుమపువ్వు... ఒక టీ. నెయ్యి... 120 గ్రా. పంచదార... 700 గ్రా. కొబ్బరితురుము... కప్పు పిస్తా పప్పు... రెండు టీ.
తయారీ విధానం : కాస్త నేతిలో సేమ్యా వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పంచదార, ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి పాకం పట్టాలి. చిన్న సెగమీద సన్నటి తీగపాకం రానివ్వాలి. తరవాత అందులో కుంకుమపువ్వు, వేయించిన సేమ్యాను వేసి నీరంతా ఇంకిపోయేవరకూ సన్న మంటమీద ఉడికించాలి.
అందులోనే కొబ్బరి తురుము కూడా వేసి కలిపి దించాలి. ఓ వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి పైన పిస్తాపప్పులు చల్లి బాగా చల్లారిన తరవాత ముక్కలుగా కోయాలి. అంతే తియ్యతియ్యని సేమ్యా సఫ్రాన్ కేక్ రెడీ...!