కావలసిన పదార్థాలు : క్యాప్సికం... ఒకటి బంగాళాదుంపల మిశ్రమం... రెండు కప్పులు క్యారెట్... ఒకటి బీన్స్... పది బఠానీలు... పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి... రెండు కార్న్‌ఫ్లోర్, మైదా... చెరో టీ. గుడ్డు... ఒకటి నూనె... తగినంత ఉప్పు... సరిపడా
తయారీ విధానం : ఓ పాత్రలో కూరగాయల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి. అందులోనే కార్న్‌ఫ్లోర్, మైదా వేసి కలపాలి. ఉప్పు, గుడ్డుసొన కూడా వేసి కలిపి కావలసిన ఆకారంలో చేసుకుని బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి. అంతే వేడి వేడి మిక్స్‌డ్ వెజిటబుల్ కట్‌లెట్స్ తయారైనట్లే... వీటిని పుదీనా లేదా టొమోటో మరియు చిల్లీసాస్‌లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.