కావలసిన పదార్థాలు : నూడుల్స్... రెండు పాకెట్లు ఉల్లిపాయ... ఒకటి బీన్స్... వంద గ్రా. క్యారెట్... రెండు పచ్చిమిర్చి... ఆరు అల్లం పేస్ట్... ఒక టీ. సోయాసాస్... 1/4 కప్ బెంగళూరు పచ్చిమిరప... ఒకటి
తయారీ విధానం: ముందుగా నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించిన తర్వాత తరిగిన కూరగాయ ముక్కలు, బెంగళూరు పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి. దీంట్లోనే సోయాసాస్‌లను కలిపి ఉడికించిన న్యూడుల్స్‌ను కలపాలి. అంతే యూఎస్ స్టయిల్ నూడుల్స్ రెడీ. ఈ నూడుల్స్‌కు కార్న్‌ఫ్లోర్, వెజిటబుల్ సూప్‌ను సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.