కావలసిన పదార్థాలు : పాలు... అర లీ. కోడిగుడ్లు... ఆరు పంచదార... 150 గ్రా. స్ట్రాబెర్రీ జామ్... వంద గ్రా. క్రీమ్... 300 గ్రా. జెలాటిన్... మూడు టీ.
తయారీ విధానం : కోడిగుడ్లలోని పచ్చసొనకి పంచదార చేర్చి బాగా కలపాలి. తరువాత పాలుపోసి బాగా కలిపి ఆవిరిమీద ఉడికించి సాస్‌లాగా తయారు చేసి, చల్లబర్చాలి. జెలాటిన్ పొడిని వంద మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేడినీటిమీద ఉంచి కరిగించాలి. తరువాత దీన్ని గుడ్డు మిశ్రమంలో కలిపి చల్లటి ఐసుగడ్డమీద గిన్నెను పెట్టి తిప్పుతూ చల్లబరచాలి.
గుడ్లలోని తెల్లసొనని బాగా గిలకొట్టాలి. తరువాత స్ట్రాబెర్రీ జామ్‌ను కలిపి మళ్లీ గిలకొట్టాలి. ఇప్పుడు పాల మిశ్రమం చేర్చి పూర్తిగా కలిసేంతదాకా కలపాలి. చివరగా క్రీమ్‌ని కూడా కలిపి మౌల్డ్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి గట్టిగా అయ్యాక తీసి సర్వ్ చేయాలి. అంతే స్ట్రాబెర్రీ మూన్ తయారైనట్లే...!