కావలసిన పదార్థాలు : పాలు.. ఒక లీ. మిల్క్‌మెయిడ్.. వంద గ్రా. కుంకుమ పువ్వు.. ఒక గ్రా. ఐస్‌క్యూబ్స్.. మూడు ఎండిన గులాబీ రేకులు.. 25 గ్రా. బాదం.. 25 గ్రా. ఏలకుల పొడి.. 5 గ్రా. తర్భూజ గింజలు.. 25 గ్రా. సోంపు.. 10 గ్రా. మిరియాలు.. 5 గ్రా. గసాలు.. 100 గ్రా. పిస్తా.. 25 గ్రా.
తయారీ విధానం : గులాబీ రేకులు, ఏలకులు, తర్భూజ గింజలు, సోంపు, మిరియాలు, గసాలను రెండు గంటలపాటు నానబెట్టి ఉంచాలి. పాలను కాచి చల్లార్చి పక్కన ఉంచాలి. నానబెట్టిన వాటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా కలియబెట్టాలి. ఆపై పాలను వడబోయాలి.
వడబోసిన పాలలో మిల్క్‌మెయిడ్, కుంకుమపువ్వు, ఐస్ క్యూబ్‌లను వేయాలి. పిస్తా, బాదంపప్పులను వేడినీటిలో నానబెట్టి పొట్టుతీసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్టును కూడా మిల్క్‌మెయిడ్ కలిపిన పాలల్లో వేసి బాగా కలియబెడితే మిల్క్‌మెయిడ్ తండాయ్ సిద్ధమైనట్లే..! దీనిని అలాగేగానీ, కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరిచి అయినాగానీ సర్వ్ చేస్తే సరిపోతుంది.