పిస్తా కుల్ఫీ..?

శనివారం, 30 మార్చి 2019 (11:47 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 1 లీటరు
చక్కెర - 250 గ్రా
బ్రెడ్ - 1 స్లైస్
బాదంపప్పు - 20
పిస్తాపప్పు - అరకప్పు
యాలకులు - 4
కుంకుమపువ్వు - 2 లేదా 3.
 
తయారీ విధానం:
ముందుగా అరలీటర్ పాలు మరిగించుకోవాలి. ఆపై పాలు బాగా చల్లారిన తరువాత అందులో చక్కెర, బ్రెడ్, బాదం పప్పు పొడి, పిస్తాపప్పు, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్‌సెట్ చేసి అందులో పాలమిశ్రమం పోయాలి. ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చాలి. దీనిని 12 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. తరువాత కుల్ఫీ మౌల్డ్స్‌ని వేడినీటిలో ముంచితీస్తే ఫ్రీజ్ అయిన తర్వాత కూడా కుల్ఫీ బయటకు సులభంగా వచ్చేస్తుంది. అంతే... పిస్తా కుల్ఫీ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు