కావలసిన పదార్థాలు : మైదా.. 115 గ్రా. ఐసింగ్ షుగర్.. 30 గ్రా. బటర్.. 115 గ్రా. వెనీలా ఎసెన్స్.. కొన్ని చుక్కలు టూటీ ఫ్రూటీ.. అలంకరణ కోసం
తయారీ విధానం : బేకింగ్ ట్రే పైన వెన్న రాసి మైదా చల్లుకుని పక్కన పెట్టుకోవాలి. బటర్‌ని క్రీమ్‌లాగా చేయాలి. ఇందులో పంచదార వేసి మృదువుగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలాగా ఉండే పైపింగ్ బ్యాగ్స్‌కు కావాలసిన అచ్చు సెట్ చేసి.. రకరకాల షేపుల్లో బేకింగ్ ట్రే పైన ఒత్తుకోవాలి. ప్రతి బటర్ బటన్‌పైన టూటీ ఫ్రూటీని అలంకరించాలి.
ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్‌ని ముందుగా 150 డిగ్రీల వరకు వేడిచేసి అందులో బటర్ బటన్స్ ఉంచిన ట్రేను పెట్టాలి. పదిహేను నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. చల్లారిన తరువాత సర్వ్ చేయాలి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే బటర్ బటన్స్ ఎంతో రుచికరంగా ఉంటాయి. మీరూ ట్రై చేయండి.