ఉడికించే పాస్తాలో చెంచా ఆలివ్‌నూనె వేస్తే...!!

సోమవారం, 30 ఏప్రియల్ 2012 (12:29 IST)
FILE
* చిన్న ఇంగువ ముక్కను శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి సగ్గు బియ్యం వడియాలు నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచితే వేయించినప్పుడు మంచి వాసన వస్తాయి.

* పకోడీలు మరీ మెత్తగా వస్తుంటే, సెనగ పిండిలో చెంచా వేడి నూనె, చిటికెడు వంటసోడా కలిపితే పకోడీలు కరకరలాడుతుంటాయి.

* వేయించడానికి ముందు బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్లలో అరగంటపాటు నానబెట్టితే ముక్కలు రుచిగా ఉంటాయి.

* గసగసాలను వేడినీళ్లలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా అవుతుంది.

* పాస్తాను ఉడికించే నీళ్లలో చెంచా ఆలివ్‌నూనె, చిటికెడు ఉప్పు వేస్తే ఒకదానికొకటి అతుక్కోదు.

* వంటింటి గట్టుపై వలికిన నూనె శుభ్రం చేయడానికి, కొద్దిగా గోధుమపిండిని చల్లాలి. అది నూనెను పీల్చుకొన్న తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి