గుజరాత్- మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జీ కుప్పకూలింది.. ముగ్గురు మృతి (video)

సెల్వి

బుధవారం, 9 జులై 2025 (10:35 IST)
Gujarat Bridge
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం వంతెన కూలిపోవడంతో కనీసం ముగ్గురు మరణించగా, ఇంకా చాలా మంది నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఇంతలో, ఇప్పటివరకు నలుగురిని రక్షించామని, ఆపరేషన్ కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్‌ తెలిపారు.
 
మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోయిందని అధికారి తెలిపారు. మహిసాగర్ నదిపై ఉన్న వంతెనలో ఒక భాగం కూలిపోవడంతో దాదాపు నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి.

బ్రేకింగ్ న్యూస్

గుజరాత్‌లో కుప్పకూలిన
వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయిన వాహనాలు

వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉన్న గంభీర బ్రిడ్జీ

ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో… pic.twitter.com/QRB8pvCNWD

— Telugu Scribe (@TeluguScribe) July 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు