పూరీ పిండిలో రెండు చెమ్చాలు బొంబాయి రవ్వను కలిపితే..
గురువారం, 12 జులై 2012 (17:14 IST)
FILE
పూరీ పిండిలో చెమ్చాలు బొంబాబు రవ్వ మరో రెండు చెమ్చాలు మైదా కలిపితే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. బజ్జీలు కరకరలాడాలంటే శనగపిండిని బియ్యపు పిండిని తీసుకోండి దానిలో తగిన మోతాదులో ఉప్పు కారం వేయండి.
తర్వాత చిటికెడు సోడా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా బొంబాయి రవ్వ వేడినీరు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో బంగాళాదంపు అరటికాయ నేతిబీరకాయ కాలీఫ్లవర్ ముక్కలను ముంచి దోరగా వేయించండి.
పాలు మరిగించేటప్పుడు మీగడ ఎక్కువగా మందంగా కట్టాలంటే పాలుకాచే గిన్నెమీద, జల్లెడలాగా చిల్లులు వున్నమూతను ఉంచండి. నూనె వేయకుండా ఎగ్స్ ఫ్రై చేయాలంటే బాణలిలో ముందు అరచెమ్చా ఉప్పు వేయండి.
ఇలా చేయడం ద్వారా చక్కగా ఫ్రై కావడమే కాక బాణలికి అంటుకోదు. సాంబారు రుచిగా వుండాలంటే సాంబారు తెర్లుతున్నప్పుడు కొన్ని నిమ్మరసం బొట్లు వేయండి సాంబారు మంచి రుచిగా వస్తుంది.