వంట పాత్రలకు ఉండే జిడ్డు పోవాలంటే...

గురువారం, 15 జూన్ 2023 (11:57 IST)
వంట చేసే క్రమంలో ఒక్కోసారి కుక్కర్లు, పాత్రలు మాడి అడుగు పట్టేస్తుంటాయి. ఇలాంటప్పుడు టబ్ నీళ్లల్లో కప్పు బ్లీచింగ్ పౌడర్ కలిపి... అందులో అడుగంటిన పాత్రలను అరగంట సేపు నానబెట్టి స్క్రబ్బర్‌తో తోమితే ఆ జిడ్డు పోతుంది. 
 
అలాగే, కూరలు వండే సమయంలో వంట పాత్రల మీద, గ్యాస్ స్టవ్ వెనుక గోడ మీద నూనెచింది.. జిడ్డు పేరుకుపోతుంది. దీనిని వదిలించడం కాస్త కష్టమే. సోడాలో చెంచా వంటసోడా, కొద్దిగా వెనిగర్, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. 
 
అరగంట తర్వాత స్క్రబ్బర్‌‍తో రుద్దితే జిడ్డు సులువుగా వదిలిపోతుంది. కామిక్సీ, గ్రైండర్లు కొద్ది రోజులకు జిడ్డు పడుతుంటాయి. నిమ్మచెక్కపై కాస్త వంట సోడా వేసి వీటిని రుద్ది, తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు