వంటింటి చిట్కాలు: శెనగపిండిలో పెరుగు కలిపితే..

గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:20 IST)
వంటింటి చిట్కాలు...
 
* శెనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
* సాధారణంగా పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోసెలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
* సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.
 
* వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది. 
* వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి