ఫ్రైడ్ రైస్ తయారీలో నీళ్లకు బదులు పాలు కలిపితే?

శనివారం, 22 నవంబరు 2014 (18:27 IST)
ప్రూట్ కేక్స్‌పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి. ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది. 
 
పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువైతే.. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు. 
 
పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు. 
 
పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి. 

వెబ్దునియా పై చదవండి