కోడిగుడ్డు ఉడకబెట్టేటపుడు పగలకుండా ఉడకాలంటే...

File
FILE
చాలా మంది మహిళలు వంట చేసే సమయంలో కోడిగుడ్డును కక్కర్లు లేదా వేడినీటిలో వేసి ఉడకబెడుతుంటారు. అలాంటపుడు కొన్ని కోడిగుడ్లు పగిలిపోతాయి. అయితే, కోడిగుడ్డును ఉడకబెట్టేటపుడు గుడ్డు పగలకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టినట్టయితే పగిలి పోదంటున్నారు. అంతేకాకుండా, కుక్కర్ లేదా పాత్ర అడుగు భాగం నల్లగా మారకుండా ఉండాలంటే కాస్త చింతపండు వేసి ఉడకబెట్టినట్టయితే నల్లగా అవ్వదని అంటున్నారు.

అలాగే, మటన్‌ బిర్యానీ వండేటప్పుడు మటన్‌ ముదురుగా ఉంటే త్వరగా ఉడకకపోతే ఓ చిన్న పచ్చి బొప్పాయి ముక్క వేస్తే మెత్తగా ఉడికి పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకుంటే మరింత ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని పాకశాస్త్ర నిపుణులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి