వంటింటి చిట్కాలు : పూరీలు మెత్తబడకుండా ఉండాలంటే?

FILE
వంటింటి చిట్కాలు మీ కోసం..

* పూరీలకు పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెరను చేర్చుకుని కలుపుకుంటే పూరీ మెత్తబడకుండా ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటుంది.

* పెరుగు పుల్లబడకుండా ఉండాలంటే ఓ చిన్న టెంకాయ ముక్క వేసివుంచితే సరిపోతుంది.

* ఆకుకూరల్ని ఉడికించేటప్పుడు కొంచెం వంటనూనెను చేర్చి ఉడికిస్తే ఆకుకూర రంగు తగ్గిపోకుండా, రుచికరంగా ఉంటుంది.

* ఇడ్లీలకు ఉద్దిపప్పు రుబ్బేటప్పుడు గట్టిగా రుబ్బుకుని కాసింత మంచినూనె కలుపుకుంటే ఇడ్లీలు మృదువుగా ఉంటాయి. రెండు రోజులైనా చెడిపోకుండా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి