కరోనా నుంచి కోలుకున్నా.. బ్రెయిన్ డ్యామేజ్ తప్పదట... (Video)

మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:17 IST)
కరోనా సోకడం.. ఆపై ఆ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా కొన్ని అనారోగ్య సమస్యలు తప్పట్లేదనే విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌కు సంబంధించిన తొలి కేసు ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో నమోదైంది. కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించింది.
 
కాగా.. చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసు పూర్తి వివరాలను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా బారిన పడ్డ 11 ఏళ్ల బాలికలో వైరస్ కారణంగా కలిగిన ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్(ఏడీఎస్) వ్యాధిని గుర్తించామని చెప్పారు. ఈ వయసు పిల్లల్లో ఇటువంటి వ్యాధి రావడం ఇదే తొలిసారి అని అక్కడి డాక్టర్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుంది. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో ముఖ్యం. అయితే వైరస్ కారణంగా..ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో బాలిక చూపు మందగించింది.
 
కాగా.. డా. గులాటీ సారథ్యంలోని వైద్యం బృందం ఆమెకు చికిత్సను అందించింది. ఆమె కంటిచూపు మునుపటితో పోలిస్తే 50 శాతం మెరుగవడంతో డాక్టర్లు ఆమెను ఇటీవలే డిశార్జ్ చేశారు. ఏడీఎస్ కారణంగా కంటిచూపుతో పాటూ కండరాల కదలికలు, ఇతర ఇంద్రియాలు, మూత్రాశయం, వంటివి ప్రభావితమవుతాయని డాక్టర్లు చెప్పారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు