కరోనా వైరస్ తగ్గుముఖం.. నలభై వేలకు పడిపోయిన కేసులు

మంగళవారం, 20 అక్టోబరు 2020 (12:07 IST)
భారత్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకి సగటున 90 వేల కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య నలభై వేలకు పడిపోయింది. సోమవారం రోజున కొత్తగా 46,791కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 587 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. సోమవారం ఒక్కరేజే 69,721మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 67,33,329మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,15,197 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,48,538 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది. 
 
దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,32,795 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 9,61,16,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు