ఇంజక్షన్‌కు బదులు నాసికా డ్రిప్ ద్వారా ఇవ్వడమే ఈ మందు ప్రధాన ప్రయోజనం. యూఎస్‌లోని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని ,మెరుగైన రోగనిరోధక శక్తిని అందిస్తుందని భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ కంపెనీ 3100 మందికి 2 డోస్‌లు, 875 మందికి బూస్టర్ ఇవ్వడం ద్వారా ట్రయల్ నిర్వహించింది.